
ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక
జ్యూరిచ్: 2021 ఏడాదికి ఫిఫా అత్యుత్తమ ఆటగాడి అవార్డును రాబర్ట్ లావొండోవిస్కీ అందుకున్నాడు. ఆన్లైన్ ఓటింగ్‌లో గత ఏడాదికిగాను ఉత్తమ ప్రదర్శన చూపిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇక రన్నరప్(2వ స్థానం)గా అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ, మూడో స్థానంలో మహ్మద్ సలాV్‌ా ఎంపికయ్యారు. ఉత్తమ ఆటగానికి ఎన్నికైన లావొండోవిస్కీకి ఫిఫా అధికారులు ఫిఫా హెడ్‌క్వార్టర్‌లో జరిగిన ఆన్లైన్ కార్యక్రమంద్వారా ట్రోఫీని ప్రదానం చేశారు. ఫిఫా టైటిల్ విజేత, ట్రోఫీని అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందని లావొండోవిస్కీ ట్విటర్వేదికగా తెలిపాడు. ఓటింగ్‌లో 200 దేశాలకు చెందిన కోచ్‌లు, కెప్టెన్లు, ఎంపిక చేసిన మీడియా అధికారులు మాత్రమే పాల్గన్నారు. లావొండోవిస్కీ గత ఏడాది బండెసిలిగాలో రికార్డుస్థాయిలో 41 గోల్స్ బ్రయాన్ తరఫున కొట్టాడు. అంతేగాక ఆ జట్టు 2020-21 సీజన్ టైటిల్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. లియోనెల్ మెస్సీ బయర్న్ మ్యూనిచ్ తరఫున, అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలుచుకోవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. మహ్మద్ సలేV్‌ా లివర్ పూల్ తరఫున అద్భుత ప్రదర్శనను కనబరిచాడు.