Jul 29,2021 23:24

మ్యాప్‌లను పరిశీలిస్తున్న జెసి, సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - నిజాంపట్నం : నిజాంపట్నం హార్బర్‌ ఫేజ్‌-2 కింద చేపట్టే నిర్మాణ పనుల్లో భాగంగా మత్స్య సంపదను ప్రాసెసింగ్‌ చేసుకునేందుకు అనువుగా ఫిష్‌ప్రాసెసింగ్‌ ప్లాంట్స్‌ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని జెసి దినేష్‌కుమార్‌ తెలిపారు. ఫిష్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్స్‌ ప్రాజెక్టుకు అవసరమైన 5 ఎకరాల అటవి భూమిను తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనాతో కలిసి గురువారం పరిశీలించిన జెసి మాట్లా డుతూ హార్బర్‌ చుట్టుప్రక్కల ఏ ప్రాంతం లోఈ ప్రాజెక్టు నిర్మిస్తే చేస్తే బాగుంటుదన్న విషయపై కాంట్రాక్టర్స్‌, డ్రైనేజి, ఇరిగేషన్‌ శాఖ అధికారులతో చర్చించామన్నారు. ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రాజెక్టుకు నిర్మాణాన్ని తుంగభద్ర డ్రైన్లో నిర్మించ కుండా మంచి అనువైనా ప్రాంతంలో నిర్మించడం ద్వారా టోటల్‌ ఫ్లడ్‌ బ్యాంక్‌ ఈ ప్రాజెక్టులో తగ్గకుండా ఉంటుందని, పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. మరో 35 ఎకరాల అటవీ భూమిని డిఫారెస్ట్‌ చేస్తామని, తెలిపారు. పరిశీలనలో మత్స్యశాఖ జెడి రాఘవరరెడ్డి, డిడి సురేష్‌, తహశీల్దారు శ్రీనివాస్‌, ఎంపిడిఒ నాగలక్ష్మి పాల్గొన్నారు.