Sep 27,2021 01:45

రన్‌లో పాల్గొన్న సూర్యారావు తదితరులు

నక్కపల్లి : గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ అన్ని తరగతుల ప్రజలకు ఫిట్‌ ఇండియా కార్యక్రమంపై అవగాహన కల్పించాలని జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి నగిరెడ్డి సూర్యారావు అన్నారు. ఆదివారం నక్కపల్లిలో హాకీ క్లబ్‌ వ్యవస్ధాపకులు బి.సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా 2కె రన్‌ కార్యక్రమం జరిగింది. మండల ఉపాధ్యక్షుడు వీసం నానాజీ, నగిరెడ్డి సూర్యారావులు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. హాకీ క్రీడా ప్రాంగణం నుంచి హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ఉత్సాహంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా డిఎస్‌డిఒ సూర్యారావు మాట్లాడుతూ ఫిట్‌ ఇండియా - ఆజాద్‌ కీ అమృత మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో రెండు కిలోమీటర్లు మేర రోడ్డు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, అక్టోబర్‌ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రన్‌ ప్రారంభానికి ముందు హాకీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిఎస్‌డిఒ సూర్యారావుతోపాటు కోచ్‌లు జోజి, అచ్యుతరావు, రమణ, ఝాన్సీ, నాగేశ్వరరావు, శామ్యూల్‌, వైకుంఠరావు, జి.సాయి, హైస్కూలు ఫిజికల్‌ డైరెక్టర్‌ కుందూరు రాజు తదితరులను ఘనంగా సత్కరించారు. స్థానిక క్రీడాభిమాని ఎల్లేటి సత్యనారాయణ తన స్నేహితుని ద్వారా ముగ్గురు క్రీడాకారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు ఎన్‌విఎస్‌.ఆచార్యులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు వెటరన్‌ జి.రామచంద్రరావు పాల్గొన్నారు.