Jun 10,2021 19:00

హైదరాబాద్‌ : ఓటీటీల హవా పెరగడంతో.. ఇప్పటికే చాలామంది స్టార్లు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చారు. గతంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుని కూడా డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారా అని ప్రశ్నించినప్పుడు మంచి కథ దొరికితే.. కచ్చితంగా నటిస్తానని బదులిచ్చారు. ఇప్పుడు ఆయన స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా కథ దొరికిందని.. అందులో నటించనున్నారని టాక్‌. కాగా.. ది ఫ్యామిలీ మేన్‌ 1-2 సిరీస్‌లు ఎంతటి విశేష ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తాజాగా ఈ సిరీస్‌కి కొనసాగింపుగా.. ది ఫ్యామిలీ మేన్‌ 3 ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. సీజన్‌ 1 లో సందీప్‌ కిషన్‌, సీజన్‌ 2లో సమంతను ఎంపిక చేసుకున్నారు. అదేవిధంగా సీజన్‌ 3లో కీలకపాత్రలో మహేష్‌బాబుని రాజ్‌ అండ్‌ డీకె ఎంపిక చేసుకున్నారని టాక్‌. ఇప్పటికే రాజ్‌ అండ్‌ డీకె మహేష్‌బాబుని కలిసి రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడినట్లు... తనకిచ్చే పారితోషకాన్ని భారీ మొత్తంలోనే ఇవ్వనున్నట్లు వార్తలు హల్‌చల్‌చేస్తున్నాయి. ఇక మహేష్‌బాబు కూడా.. సిరీస్‌లో నటించేందుకు మిగతా సినిమాల డేట్స్‌ను సర్దుబాటు చేసుకుంటూ నటించనున్నారని తెలుస్తోంది. మరి రాజ్‌ అండ్‌ డీకే మహేష్‌ రోల్‌ను కూడా ఇంప్రెసివ్‌గా డిజైన్‌ చేయగలిగితే ఆయన సీజన్‌ 3లో కనిపించడం ఖాయమని సినీ వర్గాల సమాచారం.