Aug 09,2022 18:40

    ఢిల్లీ : ఒక్క ఏడాదిలో ప్రధాని నరేంద్రమోడీ ఆస్తులు రూ.26 లక్షల మేర పెరిగింది. ఈఏడాది మార్చి 31 నాటికి ప్రధాని ఆస్తుల విలువ రూ.2.23 కోట్లకుచేరుకుంది. గుజరాత్‌లోని నివాసయోగ్యమైన భూమిని ప్రధాని విరాళంగా ఇచ్చినట్టు తాజాగా విడుదల చేసిన సమాచారంలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) పేర్కొనుది. ఏటా ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్న మోడీ, ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉండగా, వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. మోడీకి ఎలాంటి స్థిరాస్థులూ లేవని పీఎంవో స్పష్టం చేసింది. గాంధీనగర్‌లో ఉను కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది. బాండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో మోడీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది. కానీ ఆయనకు నాలుగు బంగారు ఉంగరాలు ఉండగా, వాటి విలువ రూ.1.73 లక్షలుగా ఉంటుందని డిక్లరేషన్‌లో పేర్కొంది. అయితే మార్చి 31 2021 నాటికి మోడీ వద్ద ఉన్న రూ.1.1 కోట్ల విలువ చేసే ప్లాట్‌ను విరాళంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి మోడీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504లుగా ఉన్నట్టు తెలిపింది.
    2002 అక్టోబర్‌లో మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి కొనుగోలు చేసిన నివాసయోగ్య భూమి (సర్వే నెంబర్‌ 401(ఎ))లో ఒక్కొక్కరికి 25శాతం సమానవాటా ఉందని, దాన్నే మోడీ విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం మోడీ చేతిలో రూ.35,250 నగదు, పోస్ట్‌ ఆఫీస్‌లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లతో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నట్టు పేర్కొనుది. మరోవైపు ప్రధానితో పాటు తమ ఆస్తుల వివరాలు వెల్లడించిన కేబినెట్‌ మంత్రుల్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కురూ.2.54 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉండగా, రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉనాుయి. మొత్తం 29మంది కేబినెట్‌ మంత్రులు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో తమ సొంత, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు ప్రకటించిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌.కె.సింగ్‌, హర్‌దీప్‌సింగ్‌ పురి, పురుషోత్తం రూపాలా, జి.కిషన్‌రెడ్డి ఉనాురు. గత ఆర్థిక సంవత్సరలో కేబినెట్‌ మంత్రిగా పనిచేసి, గత నెలలో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.