
ప్రజాశక్తి - కర్నూలు క్రైం : సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమాన్ని తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవడం వలన జూలై 4 (సోమవారం) నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం వాయిదా పడిందన్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమానికి రావొద్దని, ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం(జూలై 11) నుండి “ స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని పేర్కొన్నారు.