Aug 19,2022 14:06

ప్రజాశక్తి-పలాస : పలాసలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంత టిడిపి కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ నివాస గృహాన్ని గురువారం రాత్రి తొలగించేందుకు మున్సిపల్ అధికారులు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా పలాస కౌన్సిలర్ నివాస గృహానికి వెళ్లేందుకు వచ్చిన అచ్చం నాయుడు రామ్మోహన్ నాయుడు గౌత శిరీషలను లక్ష్మీపురం టోల్గేట్ వద్ద అడ్డుకొని వారికి నోటీసు ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త చోటుచేసుకుంది. టిడిపి నేతలు పలాస వెళ్లనివ్వకుండా పోలీసులు భారీగా మోహరించి వారి వాహనాలను అడ్డుకున్నారు. కొందరిని  అరెస్ట్ చేసి టెక్కలి పోలీస్ స్టేషన్ తరలించారు.