Oct 05,2022 13:36

ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న జగన్ ఆలోచనలకు అనుగుణంగా 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం తోడవ్వాలని కోరుతూ పాలకొల్లు వైసిపి కార్యాలయంలో పూజలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ సారధ్యంలో పూజలు జరిగాయి. విజయాలకు నెలవైన విజయదశమి సందర్భంగా మరోపక్క ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కోరుకునే వారి మనసులు మార్చాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు, పోడూరు వైస్ ఎంపీపీ గుబ్బల సత్యనారాయణ, పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను,యలకల రంగా, కెల్ల పెద్దిరాజు, కొండేటి రవి పాల్గొన్నారు.