Sep 27,2021 12:50

హైదరాబాద్‌ : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రామూడిగా, పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్ను చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్ర నిర్మాతలు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ మూవీ 500 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతుంది. కరోనా పరిస్థితుల రీత్యా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదాపడినా ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. దర్శకుడు ఓంరౌత్‌.. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌రy ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కానుంది. ఈ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రాముడిగానూ, కృతిసనన్‌ సీతగానూ నటిస్తోంది. ఇక లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.