
'కాదలన్' చిత్రంలో ప్రభుదేవా, వడివేలు నర్తించిన 'పెట్టరాప్ అనే పల్లవితో సాగే పాట చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి 'పాట్టు అడి.. ఆట్టం.. రిపీట్' అనే ట్యాగ్‌ను పెట్టారు. ఇందులో వేదిక హీరోయిన్‌గా నటించ నున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె తమిళంలో నటిస్తున్న చిత్రమిది. వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎస్‌జే.శీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లూహిల్స్ ఫిలింస్ పతాకంపై జోబీ పి.శ్యామ్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. జూన్ 15వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు.