
ప్రజాశక్తి-మైలవరం : ప్రజాశక్తి విజయవాడ బ్యూరో కుంటముక్కల శ్యామల వరప్రసాద్ సోదరి రమాదేవి(70) అనారోగ్యంతో మైలవరంలోని వారి స్వగృహంలో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రసాద్ కు ముగ్గురు అక్కలు, ఒక చెల్లి కలరు. వీరిలో రమాదేవి పెద్ద సోదరి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ఆంజనేయులు, మండల పార్టీ కార్యదర్శి రావూరి రమేష్ బాబు, సిఐటియు మైలవరం, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, ఎం మహేష్, సిపిఎం నాయకులు మోహన్ రావు, ఇస్సాక్, నాగేశ్వరరావు, శేషయ్య ప్రజాశక్తి స్టేట్ ఫోటోగ్రాఫర్ రమణ తదితరులు రమాదేవి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.