Sep 29,2022 08:10
  • సమగ్ర వివరాల శాఖలకు జిఎడి సర్క్యులర్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జోనల్‌ వ్యవస్థపై మరోసారి రాష్ట్ర పభుత్వం దృష్టి సారిస్తోరది. సమైక్య రాష్ట్ర విభజన తరువాతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేరదుకుగాను జులైలో అన్ని శాఖలకూ స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అయితే, ఇప్పటివరకూ కనీసం ఒక్క శాఖ నురచి కూడా ఎటువంటి వివరాలు అందచలేదు. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ తాజగా అన్ని శాఖలకు సర్క్యులర్లు పంపింది. ఆ శాఖల్లో ఉన్న పోస్టులు, వాటి క్యాడర్లు, కొత్త పోస్టులకు సంబంధించి జోనల్‌ పరిధి మార్పు ప్రతిపాదనలు పంపాలని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అత్యవసరంగా ఈ వివరాలు పంపాలని నిర్ధేశించింది. కొత్త పోస్టులను మల్టీ జోనల్‌ పోస్టులుగా మార్చేందుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీ జోనల్‌ పోస్టుల పరిధిని మార్పు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. దీంతో ఆ శాఖల్లో ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది. నిజానికి జోనల్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం గత ఆగస్టులోనే అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా ఉరడే కమిటీలో రెవెన్యూ, ఫైనాన్స్‌, వ్యవసాయం, పాఠశాల విద్య, మున్సిపల్‌శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పంచాయతీరాజ్‌, హోమ్‌, వైద్య, ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ, జిఎడిల కార్యదర్శులు ఉరటారు. తెలంగాణలోని ప్రారతాలతో సంబంధం లేకుండా విభజిత ఆరధ్రప్రదేశ్‌లోని వివరాలు కావాలని శాఖలను కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజా సర్క్యులర్‌ జారీ చేశారు.