Oct 01,2022 18:32

తమిళ నటుడు శివ కార్తికేయన్‌ తెలుగులో 'ప్రిన్స్‌' సినిమా చేస్తున్నాడు. అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఆగస్టు చివరి వారంలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రం దీపావళికి విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు డేట్‌ ఖరారు చేస్తూ హీరో పోస్టర్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో శివ కార్తికేయన్‌ చిన్న పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, సురేష్‌ ప్రొడక్షన్స్‌, శాంతి టాకీస్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యదేవ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎస్‌.ఎస్‌ థమన్‌ సంగీతాన్ని అందించారు.