
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమోను ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు, అన్ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా టెట్లో అర్హత సాధించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తును ఉపాధ్యాయులు రాబోయే టెట్లో అర్హత సాధించాలని తెలిపారు.