Jan 28,2023 21:51
  • బ్యాంక్‌ల నుండి లక్షల కోట్ల అప్పు
  • భారీగా ఇన్వెస్ట్‌ చేసిన ఎల్‌ఐసి

న్యూఢిల్లీ : బ్యాంక్‌లు, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్లలో పొదుపు చేసుకును ప్రజల సొమ్ము ప్రమాదంలో పడింది. అక్కౌంట్స్‌ మోసాలు, మనీలాండరింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్న అదానీ గ్రూపు కంపెనీలకు అనేక విత్త సంస్థలు భారీగా అప్పులు ఇవ్వడం, ఈక్విటీ రూపంలో పెట్టుబడులు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ అదానీ అవకతవకలపై విడుదల చేసిన 108పేజీల నివేదికపై ఆ సంస్థకానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు పెదవి విప్పని సంగతి తెలిసిందే. దీంతో వివిధ రూపాల్లో ఆ గ్రూపునకు వెళ్లిన ప్రజల కష్టార్జితం ఎంతవరకు సురక్షితమను ఆందోళన వ్యక్తమవుతోంది.

  • ఎల్‌ఐసి పెట్టుబడులు ఇలా...

ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసి అదానీ గ్రూపు సంస్థల్లో కొన్ని సంవత్సరాలుగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్‌ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్‌ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి పెంచుకుంది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అంబూజా సిమెంట్‌, ఎసిసి తదితర అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి రూ.80వేల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. అదానీ అవకతవకలు వెలుగులోకి వచ్చిన తరువాత రెండు రోజుల్లో ఎల్‌ఐసి రూ.18వేల కోట్ల మేర నష్టాలు చవి చూసింది. అయినా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పిఒలో మరో 300 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మరింత పడిపోతే ఎల్‌ఐసి పెట్టుబడులు మరింత కరిగి పోనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • మ్యూచువల్‌ ఫండ్లు... అప్పులు

2022 డిసెంబర్‌ ముగింపు నాటికి దేశంలోని అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు అదానీ కంపెనీల్లో స్థూలంగా రూ.25,263 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఐసిఐసిఐ, యాక్సిస్‌, హెచ్‌డిఎఫ్‌సి, క్వాంట్‌. టాటా, యుటిఐ తదితర మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టాయి. అదానీ గ్రూపులోనిఐదు కంపెనీలకు భారత బ్యాంక్‌లు రూ.81,200 కోట్ల అప్పులు ఇచ్చాయి. మిగితా ఐదు లిస్టెడ్‌, ఇతర అనుబంధ కంపెనీలకుఇచ్చిన అప్పుల లెక్కలేదు. 2021-22 ముగింపునకుముందు మూడేళ్లలో అదానీ అప్పులు రెట్టింపై రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకుచేరాయి. బ్యాంక్‌లు ఇచ్చిన అప్పుల్లో 25 శాతం పెరుగుదల ఉంది. అదానీ గ్రూపు మొత్తం అప్పుల్లో ఒక్క స్టేట్‌ బ్యాంకుఆఫ్‌ ఇండియా నుండే 40 శాతం ఉనాుయనిసమాచారం. అదానీ గ్రూపు కంపెనీల మోసాలపై వస్తున్న ఆరోపణలు రుజువు అయితే.. భవిష్యత్తుల్లో అదానీ సామాజ్య్రం మునిగిపోతే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్ర అగాథంలోకి పడిపోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రభుత్వ సంస్థలే ఎలా? : జైరామ్‌ రమేష్‌

అదానీ గ్రూపునకు ప్రైవేటు సంస్థల కన్నా ప్రభుత్వ సంస్థలే ఎక్కువ రుణాలు ఇవ్వడంతో పెట్టుబడులు కూడా పెట్టాయని ఇది ఎలా సాధ్యమైందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జై రామ్‌ రమేష్‌ ప్రశిుంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అదానీ అత్యంత సనిుహితుడైనందున తాజా ఆరోపణలకు ప్రాధాన్యత పెరగిందనిపేర్కొనాురు. నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉనుప్పటి నుండి అదానితో అనుబంధం కొనసాగుతును విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలన్నారు.

  • ప్రజల ప్రయోజనాలు కాపాడండి : సీతారాం ఏచూరి

అదానిగ్రూపు అవకతవకల వ్యవహారంలో ప్రజల ప్రయోజనాలను కాపాడాలనిసిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకుచేసిన ట్వీట్‌లో అదానిగ్రూపుపై వచ్చిన ఆరోపణలు నిజమైతే కోట్లాది మంది ప్రజల జీవితాలు నాశనం అవుతాయనిపేర్కొనాురు,.

  • కంపెనీ పేరు బ్యాంక్‌లు ఇచ్చిన అప్పు
  1. అదానీ పవర్‌ - రూ.32,328 కోట్లు
  2. అదానీ రెన్యూవెబుల్స్‌ - రూ.20,664 కోట్లు
  3. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ - రూ.17,945 కోట్లు
  4. అదానీ పోర్ట్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ - రూ.5,183 కోట్లు
  5. అదానీ ట్రాన్స్‌మిషన్‌ - రూ.5,115 కోట్లు
  • సెబీ దృష్టి..

అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన రిపోర్టుపై సెబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అదానీ కంపెనీలు అకౌంటింగ్‌ మోసాలకు, షేర్ల ధరల పెరుగుదలలో అవకతవకలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్టుపై సెబీ నిశితంగా పరిశీలన చేస్తొందని వార్తలు వస్తునాుయి.

                                                                           విశాఖపై పంజా !

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : గడిచిన నాలుగు రోజులుగా స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తోన్న గౌతమ్‌ అదానీ మోసాలు, ఆర్థిక దారుణాలు ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. అదానీ మోసాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సాగిలపడ్డాయో కళ్లకు కట్టినట్లు ఉదాహరణలు ఉన్నాయి. ప్రజా వనరులను అదానీకి కట్టబెట్టేందుకు నిబంధనలు సడలిస్తూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి దొందూ దొందుగానే వ్యవహరించాయి. విశాఖ ఉమ్మడి జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రజా సంపదలను ఇప్పటికే కట్టబెట్టేశాయి. రాష్ట్రంలోని ప్రయివేట్‌ పోర్టులన్నింటినీ అదానీ గ్రూప్‌ సంస్థ హస్తగతం చేసుకుంది. విశాఖలోని ప్రభుత్వ పోర్టు (విపిటి), గంగవరం ప్రైవేట్‌ పోర్టు)లపై అదానీ తన 'పంజా' విసిరాడు. విశాఖ స్టీల్‌ ప్లాట్‌ను కరిగి పోనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

                                                               మ్యూచువల్‌ ఫండ్లు.. అప్పులు

2022 డిసెంబర్‌ ముగింపు నాటికి దేశంలోని అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు అదానీ కంపెనీల్లో స్థూలంగా రూ.25,263 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఐసిఐసిఐ, యాక్సిస్‌, హెచ్‌డిఎఫ్‌సి, క్వాంట్‌. టాటా, యుటిఐ తదితర మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టాయి. అదానీ గ్రూపులోని ఐదు కంపెనీలకు భారత బ్యాంక్‌లు రూ.81,200 కోట్ల అప్పులు ఇచ్చాయి. మిగితా ఐదు లిస్టెడ్‌, ఇతర అనుబంధ కంపెనీలకు ఇచ్చిన అప్పుల లెక్కలేదు. 2021-22 ముగింపునకు ముందు మూడేళ్లలో అదానీ అప్పులు రెట్టింపై రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్‌లు ఇచ్చిన అప్పుల్లో 25 శాతం పెరుగుదల ఉంది. అదానీ గ్రూపు మొత్తం అప్పుల్లో ఒక్క స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుండే 40 శాతం ఉన్నాయని సమాచారం. అదానీ గ్రూపు కంపెనీల మోసాలపై వస్తున్న ఆరోపణలు రుజువు అయితే.. భవిష్యత్తుల్లో అదానీ సామాజ్య్రం మునిగిపోతే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్ర అగాథంలోకి పడిపోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

                                                                               సెబీ దృష్టి..

అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన రిపోర్టుపై సెబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అదానీ కంపెనీలు అకౌంటింగ్‌ మోసాలకు, షేర్ల ధరల పెరుగుదలలో అవకతవకలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్టుపై సెబీ నిశితంగా పరిశీలన చేస్తొందని వార్తలు వస్తున్నాయి.
 

                                                        ప్రభుత్వ సంస్థలే ఎలా ? : జైరామ్‌ రమేష్‌

అదానీ గ్రూపునకు ప్రైవేటు సంస్థలకన్నా ప్రభుత్వ సంస్థలే ఎక్కువ రుణాలు ఇవ్వడంతో పెట్టుబడులు కూడా పెట్టాయని ఇది ఎలా సాధ్యమైందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జై రామ్‌ రమేష్‌ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అదానీ అత్యంత సన్నిహితుడైనందున తాజా ఆరోపణలకు ప్రాధాన్యత పెరగిందని పేర్కొన్నారు. నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి అదానితో అనుబంధం కొనసాగుతున్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలన్నారు.

                                                    ప్రజల ప్రయోజనాలు కాపాడండి : సీతారాం ఏచూరి

అదాని గ్రూపు అవకతవకల వ్యవహారంలో ప్రజల ప్రయోజనాలను కాపాడాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో అదాని గ్రూపుపై వచ్చిన ఆరోపణలు నిజమైతే కోట్లాది మంది ప్రజల జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు,.

accident