Aug 09,2022 21:57
  • లేకపోతే దేశంలో తిరుగుబాటు
  • జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చట్ట సభల్లో బిసిలకు50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే దేశంలో తిరుగుబాటు ఉంటుందని జాతీయ బిసి సంక్షేమ సంఘం హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం జంతర్‌ మంతర్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రదర్శన నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి బిసిలు పాల్గొన్నారు. వైసిపి ఎంపిలు మార్గాని భరత్‌, బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపి వి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపి ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జనాభా గణనలో కుల గణన చేయాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బిసిలకు సుప్రీం కోర్టు, హైకోర్టు నియామకాల్లో 2 శాతం, ప్రైవేట్‌ రంగంలో 5 శాతం ప్రాతినిధ్యం లేదని అన్నారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టే వరకు బిసి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనరు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • బిసిల లెక్క తేల్చాలి : జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

దేశవ్యాప్తంగా బిసిల లెక్క తేల్చాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జంతర్‌మంతర్‌లో మహాధరాు నిర్వహించారు. ఈ ధరాుకువైసిపి ఎంపిలు బీద మస్తాన్‌రావు, మార్గనిభరత్‌, మాజీ ఎంపి వి హనుమంతరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్‌ యాదవ్‌, తెలంగాణ యువజన అధ్యక్షులు కనకాల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.