
- ఏపీ జేఏసీ అమరావతి 10వ రోజు నిరసన ప్రదర్శన,
ప్రజాశక్తి-బాపట్ల : ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా బాపట్ల తాలూకా కార్యలయము వద్ద రెవిన్యూశాఖ, హౌసింగ్ శాఖ, ట్రెజరీ, సబ్ రిజిస్ట్రార్, MPDO, తదితర డిపార్ట్మెంట్ కార్యాలయల ఉద్యోగులతో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించడమైనది. ఆయా సంఘాల నాయకులను మరియు ఉద్యోగుల్ని ఉద్దేశించి ఏపీ రెవెన్యూ అసోసియేన్ బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సి.హెచ్.సురేష్ బాబు మరియు జిల్లా కోశాధికారి బి.ఓంకార్ లు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు కేటాయించిన బడ్జెట్ లోని మొత్తాలను ప్రభుత్వం మాకు ఎందుకు చెల్లించదు అని ప్రశ్నించారు. భద్రతగా ఉంటుందని ప్రభుత్వం వద్ద దాచుకున్న GPF, APGLI తదితర డబ్బుల్ని కూడా మాకు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఈ సందర్భంగా ఆవేదన చెందారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులకి పిలుపునిస్తూ మన న్యాయమైన కోరికల పరిష్కారానికి మాత్రమే మనం ఉద్యమం చేస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఉద్యమం మన హక్కుని మనకు రావాల్సిన ఆర్థికపరమైన చెల్లింపులు మరియు ఇతర సమస్యలు పూర్తిగా నెరవేర్చే వరకు ఈ ఉద్యమము ఆగదని ప్రతి ఒక్క ఉద్యోగి చిత్తశుద్ధితో ఉద్యమకారాచరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీమతి కవిత గారు, డిప్యూటీ తాహసీల్దార్ శ్రీమతి శ్రీదేవి గారు, ఏపీ రెవిన్యూ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు పెరుగు శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శ కె విజయ్ చంద్, కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు,ఏ.శివరామకృష్ణ, జి.సాయి, పి.శ్రీలక్ష్మి, డి.శ్రీనివాసరావు, పి.సురేష్ బాబు, డి.వెంకటేశ్వర రావు యమ్.రాజిమ్మ, మరియు వివిధ డిపార్ట్మెంట్ కి చెందిన నాయకులు పాల్గొన్నారు.