
- ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా బిజెపి ద్రోహం చేస్తోందనిసిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. బిజెపి చేసిన ఈ ద్రోహంలో వైసిపి, టిడిపిలు భాగం అయ్యాయని అన్నారు. ఢిల్లీ గద్దె వద్ద రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసే పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద శనివారం ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ పార్లమెంట్లో విభజన బిల్లుపై జరిగిన చర్చలో బిజెపితో సహా అన్ని పార్టీలు ఏపికి ప్రత్యేక హోదా అవసరమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోగా ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డారని, గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోదాడిమాండ్ను ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు.
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామనిచెప్పిన పార్టీలు, ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు ప్రజలకుద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి రాష్ట్రంలో అధికార వైసిపి వత్తాసు పలుకుతూ ఆ ద్రోహంలో పాలుపంచుకుంటుందని విమర్శించారు. ''ఇటీవలి ప్రధానిమోడీ వైజాగ్‌ను సందర్శించినప్పుడు ఆయన సమక్షంలో సిఎం వైఎస్ జగన్, తనకు ప్రధానిమోడీ, కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా ప్రత్యేకమైన సంబంధం ఉందని ప్రకటించారు. ద్రోహం చేసేవారితో అంత సుేహం ఏమిటి? అనిప్రశిుంచారు. ప్రధానిని ముఖ్యమంత్రి కలవడంలో తప్పు లేదని, అయితే, రాష్ట్రానికి మోసం చేసిన వారి పట్ల ఎందుకంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు 'దీనివల్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగడంతో పాటు, రాష్ట్ర ప్రజలు, యువత ఆకాంక్షలు తీవ్రమైన హాని కలుగుతోంది.' అని చెప్పారు. 'మరోవైపు ప్రతిపక్ష టిడిపి, జనసేనలు కూడా బిజెపి, మోడీ ప్రాపకోసం తహతహలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి ద్రోహంలో పాలుపంచుకుంటూ తెలుగు ప్రజలకు హాని చేస్తున్నాయి'' అనివిమర్శించారు. ప్రజలను మోసం చేసిన మతోన్మాద బిజెపికి, ఆ ద్రోహికి వంతపాడుతున్న వైసిపి, టిడిపి లాంటి పార్టీలకుతగిన బుద్ధి చెప్పాల్పిన అవసరం ఉందని అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హౌదాకోసం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు కూడా గతంలో ధరాులు చేశాయని, ప్రధానిమోడీకి భయపడి ఇప్పుడు మౌనంగా ఉనాుయనివిమర్శించారు. జనసేన పవన్ కళ్యాణ్ ధరాు చేశాడని, ఇప్పుడు బిజెపి పంచన చేరాడని అనాురు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానిు సిఎం జగన్మోహన్ రెడ్డి ఏరోజూ నిలదీసిన పాపాన పోలేదని, టిడిపి కూడా మౌనంగా ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వంతపాడుతున్నాయని విమర్శించారు.
- వైసిపి విఫల్ణం చలసాని శ్రీనివాస్
ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నిరాకరించి, రాజ్యాంగ స్ఫూర్తికి బిజెపి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తే తమపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాముగిసిన అధ్యాయమని చెబుతున్న బిజెపి నేతలు, ఈశాన్య రాష్ట్రాలకు 2017 వరకు ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై ఏమంటారని ప్రశిుంచారు. కాంగ్రెస్ నేత లక్ష్మీనరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకోసం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతానని అన్న సిఎం వైఎస్ జగన్ మాటలు ఎక్కడికి వెళ్లాయని ప్రశిుంచారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపి బినరు విశ్వం, ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సదాశివరెడ్డి, ఎఐకెఎస్ నేత రావుల వెంకయ్య, కుమార్ చౌదరి యాదవ్, సాకే నరేష్, విద్యార్థి, యువజన నేతలు ఎన్.లెనిన్ బాబు, జాన్సన్‌బాబు, రవీంద్ర, పరమేష్, ఎఐఎస్ఎఫ్ నేత సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
