
కన్నడ సూపర్ స్టార్, నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 2021లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి ముందు 'గంధడ గుడి' అనే వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది థియేటర్లో రిలీజ్ అయ్యింది. పునీత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకులంత థియేటర్లకు క్యూ కట్టారు. కర్ణాటక అడువుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సీరిస్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పునీత్ జయంతి సందర్భంగా సినిమాను కన్నడ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అడవులు, అందమైన ప్రదేశాలను ఇందులో చక్కగా చూపించామన్నారు నిర్మాత అశ్విని.