
న్యూఢిల్లీ : ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు, రాడికల్ ఆర్గనైజేషన్ 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ స్పెషల్ టీమ్ పోలీసులు ఎట్టకేలకు శనివారం అరెస్టు చేశారు. ఆయన తన అనుచరులతో కలిసి జలంధర్ జిల్లా షాకోట్ తాలూకాకు వెళ్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో.. స్పెషల్ టీమ్ పోలీసులు షాకోట్‌లో అన్ని వైపులా రహదారులను బారికేడ్లతో మూసివేశారు. సమాచారం చేరవేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంటరొట్ సేవలను నిలిపివేసి, స్థానిక పోలీసుల సహకారంతో మొత్తం ఏడు జిల్లాల్లో అమృత్‌పాల్ కాన్వాయ్ ని చేజ్ చేశారు. ఈ చేజింగ్‌లో మొత్తం వంద పోలీస్ కార్లు పాల్గొన్నాయి. చివరికి నిందితుల కాన్వాయ్ షాకోట్ తాలూకాకు చేరుకుని రోడ్లనీు మూసివుండటంతో పోలీసులకు చిక్కింది. అమృత్‌పాల్‌ను స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. చేజింగ్ సమయంలోనే ఆరుగురు పాల్ అనుచరులు పోలీసులకు చిక్కారు. ఆదివారం మధ్యాహుం 12 గంటల వరకు ఇంటరొట్‌పై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.