Jul 30,2022 10:51

చండీఘర్‌ : పంజాబ్‌ ఆరోగ్య శాఖ మంత్రి, ఆప్‌ నేత చేతన్‌ సింగ్‌ జౌరమజ్రా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రుల నిర్వాహణ సరిగ్గా లేదన్న ఫిర్యాదులు విపరీతంగా అందడంతో ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆసుపత్రికి.. ప్రెస్‌, కెమెరామెన్‌లతో అడుగుపెట్టిన ఆయన.. అక్కడ పడకలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్‌పై పడుకోవాలని ఆసుపత్రి వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ రాజ్‌ బహుదూర్‌ను కోరారు. చుట్టూ కెమెరాలు ఉండటంతో మంత్రి ఆదేశాలు ఆయన పాటించక తప్పలేదు. అనంతరం మంత్రి 'అంతా నీ చేతుల్లోనే ఉంది' అంటూ చాన్సలర్‌పై మండిపడ్డారు. ఆ పడక పరిస్థితిని ఒకరు ఎత్తి చూపారు. ఆసుపత్రిలో రోగులతో కూడా మాట్లాడి.. ఫిర్యాదులు అందుకున్నారు.

 

    అయితే మంత్రి తీరుపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వచ్చాయి.  ఆప్‌ చీప్‌ థియేట్రిక్స్‌ ఎప్పటికీ ఆగవని, ఆ ఆసుపత్రి వైస్‌ ఛాన్సలర్‌ బహుదూర్‌ను ప్లస్‌ 2 చదువుకున్న మంత్రి బహిరంగా అవమానించారని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఈ ప్రవర్తన వైద్య సిబ్బందిని నిరుత్సాహానికి గురి చేస్తుందని పేర్కొంది.