Sep 14,2021 15:18

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నారని క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ సంక్రమించడమే ఇందుకు కారణమని తెలిపారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్ళినప్పటికీ వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్‌ ప్రకటనలో తెలిపింది. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. జర్నలిస్టుల కోసం ఇవాళ ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు.