Jul 29,2021 22:35

ప్రజాశక్తి-తాళ్లరేవు
భోజన ప్రియులకు నోరూరించే గోదారి పులస అమలాపురం-కాకినాడ రహదారిలో కనువిందు చేస్తోంది. ఇటీవల గౌతమి గోదావరికి వరద పోటెత్తడంతో గోదావరి పులసలు లభ్యమవుతున్నాయి. ఎదుర్లంక యానం బాలయోగి వారధి వద్ద రెండు రకాల పులసలు విక్రయిస్తున్నారు. యానాం గోదావరిలో అప్పటికప్పుడు దొరికిన పులస రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతోంది. దీంతో పాటు ఒడిషా నుంచి దిగుమతి చేసుకున్న పులస రూ.1,000 నుంచి రూ.1500 పలుకుతోంది.