Jul 29,2021 19:51

పాన్‌ ఇండియాలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. ఇటీవల ఇటలీలో భారీ సెట్‌ క్రియేట్‌ చేసి ప్రధాన సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. తిరిగి హైదరాబాద్‌కి చేరుకున్న చిత్రబృందం షూటింగ్‌ పున్ణ ప్రారంభించి చివరి షెడ్యూల్‌ను విజయవంతంగా గురువారంతో పూర్తి చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'రాధేశ్యామ్‌' టీమ్‌ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. త్వరలోనే పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది.