
ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ కొత్తపేటలోని జడ్పీ హైస్కూల్లో రాగిజావ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వేటపాలెం జడ్పిటిసి బండ్ల తిరుమలాదేవి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారమైన రాగి జావను మంగళవారం నుంచి జగనన్న గోరుముద్దతో కలిపి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రాగి జావ విద్యార్థులకు బలమైన పౌష్టికాహారమని, ఎముకలు, దంతాలు, రక్తం పెరుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. వారంలో మూడు రోజులు జగనన్న గోరుముద్దతోపాటు బెల్లంతో కూడిన రాగి జావ, మూడు రోజులు జగనన్న గోరుముద్దతోపాటు చిక్కీ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీవో శర్మ, స్కూల్ కమిటీ చైర్మన్ విక్టోరియా సురేష్, ఉపాధ్యాయులు జి సుమన్, హేమంత్ కుమార్, నాగేంద్రరావు, సరళ కుమారి, శివప్రసాద్, కమిటీకి చెందిన కనపర్తి దానయ్య, దొప్పలపూడి విజయ తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: రాగిజావతో ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, జగనన్న గోరుముద్ద-రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేపల్లె మండలం పెనుమూడి గ్రామ సర్పంచ్ దారం విజరు ఎంపీయూపీఎస్ స్కూల్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం విద్యా శాఖ అధికారులతో కలిసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ విజయవర్థని, ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ, వార్డు మెంబర్ కొక్కిలిగడ్డ నాగబాబు, బాలబాలికలు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
పిట్టలవాని పాలెం: జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో 3 రోజులు రాగి జావ పంపిణీ కార్యక్రమం మండలంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ ఉపాధ్యక్షులు చేబ్రోలు కృపానందం, తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ దాసి సుజాత, ఉపాధ్యాయులు అమరనాథ్, రమేష్, సచివాలయ ఎఎన్‌ఎం ప్రేమ కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రక్తహీనతతో బాధపడే పిల్లలకు రాగి జావతో మంచి మేలు చేకూరుతుందని, ఎముకలు దృఢంగా అవుతాయని అన్నారు.
చీరాల: విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. మంగళవారం రామకృష్ణాపురంలోని ఎంఎస్‌ఎ ప్రైమరీ స్కూల్ పూర్వ విద్యార్థి మీనా స్కూల్లోని విద్యార్థులకు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్లాసుల దాత పూర్వ విద్యార్థి మీనాను చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అభినందించారు. చీరాల ఎంఎస్‌ఎ ప్రైమరీ స్కూల్, రామకృష్ణాపురంలోని రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి చీరాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగి జావ కార్యక్రమాన్ని మరియు 100 స్టీల్ గ్లాస్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథి, చీరాల శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చీరాల ఎంఈఓ డి నాగేశ్వరరావు, గ్లాసుల దాత పూర్వ విద్యార్థి మీనా, నన్నపనేని రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు బాచిన, అడ్డగడ్డ మల్లికార్జునరావు, శ్రీ కామాక్షి హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, రావి రమణారావు, రామకృష్ణాపురం వైసీపీ నాయకులు నల్లూరి బ్రహ్మం, భాస్కరరావు, కేబుల్ కృష్ణ, అందే సుబ్బారాయుడు, పసుపులేటి కోటేశ్వరరావు, మండ గిరీష్, శివ, పసుపులేటి సమర, కిరణ్‌రెడ్డి మున్నం, వంగర రమణ, గంజి రాజు, భత్తుల అనిల్, కీర్తి వెంకటరావు, స్థానిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.