Sep 25,2021 09:51

అమరావతి : విశాఖ రాజధాని అంటూ... చేసే మాయమాటల ప్రకటనలను విశాఖ ప్రజలు విశ్వసించడంలేదని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో విశాఖ నగర కార్పొరేటర్లు, ఇతర నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు మహిళ రాష్ట్ర కమిటీలోకి కొత్తగా 16 మంది చేరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని కమిటీలోకి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

మేయర్‌ మహిళను ఇబ్బందిపెడుతున్నారు : చంద్రబాబు
మేయర్‌ సుంకర పావని దంపతులు మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఇతర అంశాలను పావని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మేయర్‌ మహిళ అని చూడకుండా సుంకర పావనిని వైసిపి నేతలు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మేయర్‌ నివాసం వద్ద కెమెరాలు ఉంచడం, పార్టీ నేతలను కూడా కలవకుండా అడ్డంకులు సఅష్టించడంవంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పార్టీ తరపున విప్‌ జారీ.. ధిక్కరిస్తే సస్పెండ్‌ : చంద్రబాబు
సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలని, పార్టీ తరపున విప్‌ జారీ చేయాలని, ధిక్కరించిన వారిని సస్పెండ్‌ చేయాలని చంద్రబాబు సమావేశంలో తీర్మానించారు. కాకినాడ కార్పొరేషన్‌లో టిడిపికి వ్యతిరేకంగా వ్యవహరించే కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి టిడిపి కార్పొరేటర్లందరికీ పార్టీ విప్‌ జారీ చేస్తుందని, ధిక్కరిస్తే అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు.

వైసిపి పక్షాన లేరని.. విశాఖ ప్రజలు తీర్పిచ్చారు : చంద్రబాబు
నగరపాలక సంస్థ ఎన్నికల్లో విశాఖ ప్రజలిచ్చిన తీర్పు.. వారు వైసిపి పక్షాన లేరని స్పష్టం చేసిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ నగరంలో 4 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నామని, పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖ టిడిపి కి కంచుకోటగా ఉందని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చి ఉంటే నగర అభివఅద్ధి మరో దశకు చేరేది కానీ టిడిపి చేసిన అభివఅద్ధినంతా వైసిపి నాశనం చేసిందని విమర్శించారు. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.