
ప్రజాశక్తి- టెక్కలి రూరల్: మాజీ ఎంపీ కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయులు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. టెక్కలిలోని సత్తారు లాకనాథం కళ్యాణ మండపంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం నిర్వహించారు. ముందుగా రాజగోపాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్మాణ ఆధ్యుడు రాజగోపాలరావు అని కొనియాడారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మారుమూల గ్రామాలకు పాఠశాలలు మంజూరు చేయించిన ఘటన ఆయనకే దక్కిందని అన్నారు. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ, నైర వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసిలు దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరావు, వసంతరెడ్డి, ఎంపిపిలు అట్లా సరోజనమ్మ, నడుపూరి శ్రీరామ్మూర్తి, బిజెపి నాయకులు అట్టాడ రవిప్రసాద్, పిఎసిఎస్ అధ్యక్షులు కూరమాన బాలకృష్ణ, కెల్లి జగన్నాథం, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సోంపేట: పట్టణంలోని ప్రయివేట్ కళ్యాణ మండపంలో మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాలింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. రాజగోపాలరావు జిల్లాకు, రైతాంగానికి చేసిన సేవలను గురించి గుర్తుచేసుకున్నారు. అనంతరం రాజగోపాల్‌రావు జీవిత విశేషాలు అన్న పరిచే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాల (లల్లు), ఎంపిపి నిమ్మన దాసు, నర్తు నరేంద్ర యాదవ్, పూడి నేతాజీ, ఎన్.బాబూరావు, రౌతు విశ్వనాథం, పి.తిలక్ పాల్గొన్నారు.