Nov 25,2021 13:36

అమరావతి : రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు అతని భార్యను అల్లరిచేశారని ఎపి మంత్రి కొడాలి నాని విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి నాని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... భార్య పేరు చెబితే... ఫ్యామిలీ అంతా ఏకమవుతుందని చంద్రబాబు ప్లాన్‌ చేశారని ఆరోపించారు. అతని భార్య పేరు తీస్తే ఆ కుటుంబం మద్దతిస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు. తాము అసెంబ్లీలోగానీ, బయటగానీ, ఆమె పేరు తీయలేదని చెప్పారు. ' అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటూ, నన్ను క్షమాపణ చెప్పమనడమేంటి ? ' అని ప్రశ్నించారు. '' జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటి ? నందమూరి ఫ్యామిలీ అంటే జగన్‌కు కూడా గౌరవమే.. నందమూరి ఫ్యామిలీ అమాయకులు.. గొర్రె కసాయిని నమ్మినట్లు ఎన్‌టిఆర్‌ ఫ్యామిలీ చంద్రబాబును నమ్మింది. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు అతని భార్యను అల్లరిచేశారు '' అని కొడాలి నాని దుయ్యబట్టారు.