Apr 08,2021 23:29

మాట్లాడుతున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం: గ్రేటర్‌ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు తొలిసారిగా జరగబోయే ఎన్నికల్లో వైసిపి విజయకేతనం బాధ్యత పార్టీశ్రేణులపైనే ఉందని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. గురువారం గురువారం సాయంత్రం మార్గాని ఎస్టేట్‌ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో పార్టీ వార్డు ఇన్‌ఛార్జిలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపసీ మాట్లాడుతూ త్వరలో రాజమహేంద్రవరం గ్రేటర్‌ కార్పొరేషన్‌గా రూపుదాల్చబోతుందన్నారు. తొలి గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలని దానికి ఇప్పట్నుంచే సన్నద్ధం కావానలి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.