Oct 17,2020 11:46

హైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్‌ జంట రాజశేఖర్‌, జీవిత కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే కరోనా సోకగా..ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. రాజశేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. జీవిత క్వారెంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. అంతలో ఆయనకు కరోనా సోకింది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే.