Jul 23,2021 06:42

అతను ఎమైనా హత్య చేశాడా లేదే
ఆదివాసీల హక్కుల కోసం పోరాడాడు.
అతను ఎమైనా సంఘ విద్రోహక చర్యలకు పాల్పడ్డాడా లేదే
ప్రజల పక్షం ఉద్యమంలో ఉన్నాడు.
అతను ఎమైనా మత ఘర్షణలు చేసాడా లేదే
ప్రజల కోసం పోరాడుతున్నాడు.
అందుకే
అతనిని అరెస్టు చేసింది
ఎన్‌.ఐ.ఎ .
ఇక రాజ్యం వంతై
గొంతు నొక్కింది
చట్టం తన పని తాను చూసుకుంది.
న్యాయ దేవత కళ్ళకు గంతులు కట్టుకుని
అలానే ఉంది.
ఆదివాసీల కోసం, ప్రజల కోసం పోరాడితే
దేశద్రోహులు, అర్బన్‌ నక్సల్స్‌ ముద్రలు పడతాయి
గద్దెనెక్కిన వారి ఆజ్ఞ ప్రకారం తీర్పులు, తీర్మానాలు.
ఆదివాసీ ప్రజల కోసం పోరాడిన వారికి
బెయిల్‌ ఇవ్వకుండా
జైల్లో మగ్గిచ్చి చంపుతున్న
కోర్టులు కూడా బోనులెక్కాలి.
 

( ఫాదర్‌ స్టాన్‌స్వామికి నివాళులు )
- తంగిరాల సోని,
సెల్‌: 9676609234