Apr 07,2021 19:36

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నటుడు రాజశేఖర్‌తో 'దెయ్యం' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బుధవారం రాంగోపాల్‌వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హర్రర్‌ జోనర్‌లో సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. స్వాతి దీక్షిత్‌, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు.