May 17,2022 23:32

ఫొటో : జెన్కో ఎదుట ధర్నా చేపడుతున్న కార్మికులు

ఫొటో : జెన్కో ఎదుట ధర్నా చేపడుతున్న కార్మికులు
రాష్ట్ర ప్రభుత్వంస్పందించకపోవడం బాధాకరం
ప్రజాశక్తి-ముత్తుకూరు : ప్రయివేటీకరణ చేయొద్దని నెలల తరబడి పోరాటం చేస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టు కార్మిక జెఎసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ను లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ... 117వ రోజు అయిన మంగళవారం స్థానిక ప్లాంట్‌ మెయిన్‌ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
సేవ్‌ ఎపి జెన్కో... సేవ్‌ ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ నినాదాలతో కార్మికులు బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న శ్రమను గుర్తించకుండా నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇన్ని రోజులు రొడ్డుల మీద కూర్చొని తమ గోడు తెలుపుతున్నా... కార్మికుల ఆవేదన అటు యాజమాన్యం గానీ... ఇటు ప్రభుత్వం గానీ చలనం లేదన్నారు. ఎన్ని రోజులు ఉదాసీనతగా ఉంటే అంత ప్రతిఫలం చెల్లించుకోక తప్పదని జెఎసి నాయకులు హెచ్చరించారు.