Oct 03,2022 22:26

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
             రాష్ట్రాభివృద్ధికి సిఎం జగన్‌ నిరంతరం కృషి చేస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం స్థానిక అశోక్‌నగర్‌లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వ లేక కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అవినీతికి తావువలేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనన్నారు. ఈ సందర్భంగా ఇంటింంటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గంజిమాల రామారావు, జెడ్‌పిటిసి సభ్యులు దాసరి శ్రీలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు మంతెన సోమరాజు, ఎంపిటిసి చింతా శ్రీదేవి, గంటా శ్రీను మాజీ ఎంపిపి మట్టా సత్తిపండు వైసిపి మండల అధ్యక్షుడు గొడ్డాటి నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షులు సంకుకొండ, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.