
రామాపురం : కేంద్ర, రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం ఒక శనిగ్రహం లాంటిదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. మండలంలోని రాచపల్లి పంచాయతీ గంగనేరులో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలు చేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరని ద్రోహం మోసం చేసిందన్నారు. రాష్ట్రా నికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు స్వస్తిపలికిందన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు సామాన్యునికి అందుబాటులో లేవ న్నారు. దేశంలో బిజెపి కక్ష రాజకీయాలు ఎక్కువ చేస్తున్నరని ప్రజలకు అచ్చేదిన్ బదులు చచ్చేదిన్ దాపరిస్తున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేనలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి బిజెపి ప్రభుత్వానికి లేదని విభజన చట్టంలోని ఏ అంశాన్ని కూడా అమలు చేసే శక్తి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల అసంతప్తితో ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం పట్ల రైతులు రగిలి పోతున్నారని. మహిళలు, ఉద్యోగులు ఉడికిపోతున్నారని తెలిపారు.
కాంగ్రెస్‌లో 40 కుటుంబాలు చేరిక
మండలంలోని రాచపల్లి పంచాయతీ గంగానేరులో తులసిరెడ్డి, రాయచోటి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి అల్లా ప్రకాష్ ఆధ్వర్యంలో వైసిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 40 కుటుంబాలు చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మండలం బిసి కాంగ్రెస్ నాయకుడు గుత్తి మారి వెంకటేశ్వర్లు. మండల అధ్యక్షులు మైసూరారెడ్డి, నరేష్, వెంకటరమణ, ప్రసాద్, రామచంద్ర, నిర్మల, కష్ణయ్య, అశోక్, శీను, వెంకటరమణ, మల్లికార్జున, చిన్న సుబ్బయ్య, మంజుల, వెంకటరమణ, సుబ్బయ్య, ముస్లిం సోదరులు మరో పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి జంకరయ్య, నజీర్ అహ్మద్, సుల్తాన్, గౌస్, శ్రీనివాసులు, ఖాదరవల్లి, ఖాదర్, నాగరాజు, రవణమ్మ, లతా, బేబీ, నరసింహారెడ్డి, అమీర్, ఉతన్న, షేక్ రఫీ, వేణుగోపాల్, మంజునాథ్, చిన్నకృష్ణ, ఖదీర్ పాల్గొన్నారు.