May 17,2022 22:41

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారం చేపట్టిన మూడేళ్లలో రాష్ట్రంలో అస్తవ్యస్తపాలన సాగుతోందన్నారు. అన్నింటిపై ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై బాదుడే బాదుడు మొదలు పెట్టారన్నారు. ఈనేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో ఈనెల 20 వ తేదీన పర్యటిస్తున్నట్లు చెప్పారు. పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారని చెప్పారు. ఈపర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ ఛైర్మన్‌ చిగిచెర్లఓబిరెడ్డి, నాయకులు కమతంకాటమయ్య, వేణుగోపాల్‌ రెడ్డి, చింతపులుసుపు పెద్దన్న , పురుషోత్తంగౌడ్‌, పరిసేసుధాకర్‌ , మేకల రామాంజినేయులు, గరుగువెంగప్ప , రాంపురంశీన , గంగారపురవి తదితరులు పాల్గొన్నారు .
పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయండి : తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టెలీకాన్సరెన్స్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాయకులకు, కార్యకర్తకు సూచించారు . ఈక్రమంలో ధర్మవరం టిడిపి కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం గురించి పట్టణంలోని మొదటి వార్డుకు చెందిన కార్యకర్త బత్తల గంగాధర్‌ను అడిగారు. ఈక్రమంలో ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తిరిగి పార్టీలోకి చేరుతాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయని కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ అవన్నీ పక్కనపెట్టి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ నాయకత్వంలో పార్టీ విజయానికి కృషిచేయాలని సూచించారు.