
ప్రజాశక్తి - రేపల్లె
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఆనందం పొందుతున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి అనగానీ శివప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు రేపల్లె రామాంజనేయులు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. జగన్ నియంత పోకడలకు పోతున్నారని అన్నారు. గుళ్ళల్లో పూజాలకు కూడా వెళ్లకుండా నిర్బంధిస్తున్నారని అన్నారు. జగన్ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉప్పాల సాంబశివరావు, కొలసాని రాము, కమతం శివసుబ్రహ్మణ్యం, నాగశ్రీ, కుంభ తిరుపతయ్య, వేమూరి అజయ్, పులిగడ్డ పవన్, వెంకట్, నాదేశ్వరరావు, చిరంజీవి, ధర్మతేజ పాల్గొన్నారు.