
ప్రజాశక్తి -వడ్డాది
బుచ్చయ్యపేట మండలం వడ్డాది హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 30న అనకాపల్లిలో జరిగిన జూనియర్ ఛాంపియన్ షిప్ పాఠశాలకు చెందిన వి.యామిని, కె.కల్పన, ఎ.ధనుశ్రీ, టి.సంజరు గెలుపొందారు. వీరు వచ్చే నెల 3 నుండి 5వ తేదీ వరకు కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జూడో సెక్రటరీ సిహెచ్.శ్యామూల్ రాజ్ తెలిపారు గెలుపొందిన విద్యార్థులను హెచ్ఎం పివి శేషుబాబు, పిడి కడగళ్ల నారాయణమ్మ, పిఇటి ఎల్.అప్పలనాయుడు అభినందించారు.
రాష్ట్రస్థాయి టెన్ని కాయిట్ పోటీలకు....
అనకాపల్లి జిల్లా లేమర్తిలో నవంబర్ 30న జరిగిన మూడు జిల్లాల టెన్ని కాయిట్ పోటీల్లో బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట జెడ్పి హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. టెన్నికాయిట్ బాలుర సీనియర్ విభాగంలో బి.లీలాప్రసాద్, బాలికల సీనియర్ విభాగంలో సిహెచ్.రమ్య, కె.సంతోషి, బాలికల జూనియర్స్ విభాగంలో ఆర్.నవ్య కుమారి, ఎస్ గీతు గెలుపొందారు. వీరు డిసెంబర్లో కడప జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొంటారని పిడి ఎ.నాగరాజు తెలిపారు. విజేతలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి.వరాహమూర్తి, ఎస్ఎంసి చైర్మన్ ఎస్.వెంకట అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు.
హరిపాలెం విద్యార్థుల ఎంపిక
అచ్యుతాపురం : మండలంలోని హరిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9, 10 తరగతుల విద్యార్థులు 8 మంది ఇటీవల జరిగిన వాలీబాల్, త్రో బాల్, ఖోఖో, అథ్లెటిక్స్‌లో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వై.జగదీశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు కె.శైలు, కె.లక్ష్మి ప్రసన్న, బి.అజరు, కె.భరత్, ఎన్.అఖిల, ఈశ్వర్, అశోక్, బాలశ్రీ ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా గురువారం పాఠశాలలో ఎంపికైన విద్యార్థులను, ఫిజికల్ డైరెక్టర్ ధర్మిరెడ్డి రాజును వైసిపి మండల నాయకులు మారిశెట్టి సూర్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కెఆర్ కుమార్, టి వెంకటేష్, వి గాంధీ, ఎస్కె బాషా, బాలకృష్ణ, హైమావతి, అమ్మాజీ, రమణి, పట్నాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు.