
ప్రజాశక్తి -అనకాపల్లి : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన బాలబాలికల జట్లు వివరాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ తవిటయ్య, ఏపీ టెన్నికాయిట్ అసోసియేషన్ అసోసియేషన్ కార్యదర్శి కేఎన్వి సత్యనారాయణ శనివారం ప్రకటించారు. బాలుర జట్టుకు విజయనగరం జిల్లాకు చెందిన కే చంద్రమౌళి, డి ధనుష్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా నుంచి బి సిద్ధార్థ, ఎల్ రాజు, విశాఖపట్నం జిల్లా నుంచి కే రామకృష్ణ, జె సంతోష్ కుమార్, కే తరుణ్ శ్రీదేవ్, అనంతపురం జిల్లాకు చెందిన డి వేణు చరణ్ ఎంపికయ్యారు. బాలికల జట్టులో అనంతపురం జిల్లాకు చెందిన జి అమృత, బి రజిని, జి సుప్రియ, నెల్లూరు జిల్లాకు చెందిన పి సౌమ్య, చిత్తూరు జిల్లాకు చెందిన సి.కావ్య, విజయనగరం జిల్లాకు చెందిన పిరత్నకుమారి, ఆర్ దేవి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏ అరుణ సాయి ఎంపికయ్యారు. జట్టు కోచ్‌లుగా పి తవిటయ్య, జి రాజు, మేనేజర్‌గా పి రమణ రావు వ్యవహరించనున్నారు.