Mar 25,2023 22:53

సమావేశలో మాట్లాడుతున్న ఎస్‌పి రవీంద్రనాథ్‌బాబు


- మహిళల రక్షణకు ప్రాధాన్యత
- సైబర్‌ నేరాలపై అప్రమత్తం కావాలి
- నేర సమీక్ష సమావేశంలో ఎస్‌పి


ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి ప్రజలకు సహాయ పడేందుకు పోలీస్‌ స్టేషన్లో రిసెప్షన్‌ మహిళా పోలీసులను ఉంచాలని, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా పనిచేయాలని జిల్లా పోలీస్‌ అధికారులకు ఎస్‌పి ఎం రవీంద్రనాథ్‌ బాబు సూచించారు. శనివారం కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎఎస్‌పి పి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్‌పి పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. సైబర్‌ నేరాలు ఆన్లైన్‌ ప్రాడ్స్‌ పైసైబర్‌ నేరాలు ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీని పెంచి డైనమిక్‌ బిట్స్‌, ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘాలు పెంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుని చోరీ సొత్తు రికవరీ పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో పోలీసులు కృషి చేయాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో చార్జి సీట్లు ఏ విధమైన ఆలస్యం లేకుండా ఫైల్‌ చేసి కోర్టులో విచారణ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరు చు కుంటూ, ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని ఎస్‌పి సూచించారు. అలవాటుగా నేరాలు చేసే నేరస్థులను గుర్తించి ఎంపిక చేసిన నేరస్తులపై హిస్టరీ సీటులను తెరిచి నేరస్తులపై నిగా పెట్టాలన్నారు.
లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ వినియోగంపై మహిళా పోలీసుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, సీసీ కెమెరాలు టెంపుల్స్‌ స్టాట్య్స్‌, ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లోక్‌ అదాలతో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారాన్ని కృషిచేసి ఉత్తమ ఫలితాలు సాధించిన సీఐలకు ఎస్‌ఐలకు ప్రశంస పత్రాలు అందించి ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎఎస్‌పి బి సత్య నారాయణ, , ఎస్‌డిపిఒ పి.మురళీకష్ణారెడ్డి, డిఎస్‌పిలు పి.అంబికా ప్రసాద్‌, ఎం వెంకటేశ్వరరావు, ఎస్‌ వెంకట అప్పా రావు, సిఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.