Oct 12,2021 16:46

హైదరాబాద్‌: 'మా' ఎన్నికలపై నటి అనసూయ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖలు చేశారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసిన ఆమె ఓటమిపాలయ్యారు. ''600 ఓట్లని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారు. ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది? నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు'' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.