
అనంతపురం కలెక్టరేట్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తూ పెద్దపీట వేసిందని కలెక్టర్ ఎమ్.గౌతమి తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైఎస్సార్ యంత్రసేవా పథకం అమలులో భాగంగా రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఎమ్.గౌతమి ముఖ్య అతిథిగా హాజరై రైతులంకు ట్రాక్టర్‌లు, హార్టవెస్టర్‌లు, వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక రైతులన్నారు. రైతు బాగుంటేనే అందరం బాగుంటామన్నారు. ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. వరుణ దేవుడు కూడా సహకరించడంతో జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, దీంతో రైతు మోమోలో ఆనందం వెల్లి వెరిస్తోందన్నారు. పంటలు బాగా పండితే రైతుకు ఆనందం అన్నారు. అనంతరం రైతులకు వైఎస్సార్ యంత్రపరికరాల పంపిణీ మెగా సబ్సిడీ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంక్ ఛైర్‌పర్సన్ లిఖిత, వివిధ శాకల అధికారులు, రైతులు పాల్గొన్నారు.