Jun 01,2023 23:27

ప్రజాశక్తి-రావులపాలెం
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైయస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ పథకం ద్వారా రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌ లో పంట పెట్టుబడికి మొదట విడత సహాయం కింద ఒక్కొక్క రైతుకు రూ.7500 సిఎం జగన్‌ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని రావులపాలెంలోని మల్లిడి కంకిరెడ్డి కన్వెన్షన్‌ హాల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ పథకం కింద ఈ ఖరీఫ్‌ సీజన్‌ లో పంట పెట్టుబడి కి మొదటి విడత సహాయానికి సంబంధిన చెక్కును కొత్తపేట ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి, రాజ్యసభ ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయేల్‌, పి.గన్నవరం కొండేటి చిట్టిబాబులతో కలిసి లబ్ధిదారులకు అందించారు. కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అంతటా 1,61,386 రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద రూ.89.92 కోట్లు, పిఎం కిసాన్‌ కింద రూ.31.37 కోట్లు మొత్తం మీద రూ.121.29 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌- మే నెల లో కురిసిన అకాల వర్షాల కారణంగా 33 శాతం కన్నా ఎక్కువ వరి పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్‌ సబ్సిడీ కింద జిల్లాలో 37.26 హెక్టార్ల లో పంట నష్టానికి 76 మంది రైతులకు రూ.5,58,900 విడుదల చేశామన్నారు. రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు బ్యాంకులు రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణ మంజూరు చేసేలా ఒక పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కొనియాడారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న పథకాలలో వైయస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకం అత్యుత్తమ పథకమన్నారు. పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు మాట్లాడారు. జిల్లాలో ఎప్పటినుంచో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన కొంతమంది రైతులను సన్మానిం చారు. ఈ కార్య క్రమంలో అమలాపురం అర్బన్‌ డెవలప్మెంట్‌ అథా రిటీ చైర్మన్‌ డేవిడ్‌ రాజు , రాష్ట్ర అగ్రి మిషన్‌ సభ్యులు జిన్నూరి రామారావు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యులు జిన్నూరి వెంక టేశ్వరరావు, కొత్తపేట ఆర్‌డిఒ ఎం.ముక్కంటి, జెడ ్‌పిటిసి సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బోనం సాయిబాబు, తోరాటి సీతా మహాలక్ష్మి, ఎంపిపిలు కర్రి లక్ష్మీ వెంకట నాగదేవి, కుండా అన్నపూర్ణ, మార్గాన గంగాధరరావు, తోరాటి లచ్చన్న, వైసిపి మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జున రావు, ముత్యాల వీరభద్రరావు, కనుమూరి శ్రీనివా సరాజు, తమ్మన శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.