Nov 25,2021 12:28

హైదరాబాద్ : కనీస మద్దతు ధరల కనీస చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లతో రైతు ఉద్యమం ప్రారంభమై నవంబర్ 26 నాటికి ఏడాది పుర్తిచేసుకుంటుంది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త  కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్కు వద్ద రైతు ధర్నా నిర్వహించారు. ఎస్ కె ఎం నేతలు రాకేష్ తికాయత్, ఆశిష్ మిట్టల్, అతుల్ కుమార్ అంజన్, ఏఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల, ఏఐకెఎస్ సిసి నాయకులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కనీస మద్దతు ధరల కనీస చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, పొడు భూములకు పట్టాలు, ధాన్యం కొనుగోలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. రైతు ఉద్యమం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతు నాయకులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.