Oct 26,2021 20:15

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఒక రైతు కుటుంబానికి అండగా నిలిచారు. సూర్యపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఒక రైతు గుడిసె దగ్ధమై.. బీరువాలో దాచుకొన్న రూ.6 లక్షలు బూడిదయ్యాయి. ఈ వార్త మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఈ కథనానికి చలించిపోయిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆ రైతుకి ఆర్థిక సహాయం చేసి తన మానవత్వం చాటుకున్నారు. రూ.లక్ష రూపాయల్ని నేరుగా ఆయన బ్యాంక్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.