Jul 29,2021 15:39

ప్రజాశక్తి-ఆలమూరు : రైతుకు వెన్నుదన్నుగా ఉండే విధంగా సొసైటీలు అభివృద్ధి చెందుతూ నిరంతరం పనిచేయాలని పియుసి చైర్మన్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెనికేరు సొసైటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనుం చిన్నావతి జార్జిబాబు అధ్యక్షతన గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా సొసైటీ నూతన కార్యవర్గంగా నియమితులైన  చైర్మన్ జుత్తుక శ్రీనివాస్, సభ్యులు తిరంశెట్టి వెంకటేశ్వర్లు, పిల్లి చిన శేషయ్యల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అతిధుల సమక్షంలో అభినందన సత్కారం వారికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్నారన్నారు. రైతుల అభ్యుదయానికి వైసిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పని చేస్తుందన్నారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ సకాలంలో అకౌంట్లలో నగదు బదిలీకి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల కమిటీ అధ్యక్షుడు యణమదల నాగేశ్వరరావు, సీఈవో కె.రామకృష్ణ, వైసీపీ సీనియర్ నేతలు చల్లా ప్రభాకరరావు, తోరాటి లక్ష్మణరావు, అడబాల వీర్రాజు, నెక్కంటి బుజ్జి, తోరాటి రాంబాబు, దొండపాటి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, సవ్వాకుల శ్రీను, పెద్ద ఎత్తున  కార్యకర్తలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.