Sep 15,2021 21:19

జగ్గయ్యపేట రూరల్‌ : రైతులకు ఇవ్వాల్సిన పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన అందించాలని మండలంలోని వేదాద్రి వైసిపి గ్రామ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ గుడారు పేరయ్య నాయకులు చల్లా వైకుంఠ రావు తాసిల్దార్‌ ను కోరారు. పట్నంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ కలిసి వినతి పత్రం అందజేసి పలు సమస్యలను తహశీల్దార్‌కు తెలిపారు. సానుకూలంగా స్పందించిన తహశీల్దార్‌ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. చాట్రాయి : మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రైతు స్పందన నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి సూరి బాబు తెలిపారు. స్పందనలో సిఎం కిసాన్‌ సమాన్‌ నీది డబ్బులు పడలేదని అర్జీ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.