Oct 14,2021 21:59

రైతులకు పురుగు మందులు పంపిణీ

ప్రజాశక్తి - తొట్టంబేడు
మండలంలోని చోడవరం పంచాయతీలో రాస్‌ కెవికె వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 ఎకరాలకు మినుము పంటకు టీబిజీ 104 విత్తనాలు కలుపు మందు అందజేశారు. ఒక్కొక్క రైతుకు ఎకరా పొలంకు 15 కేజీలు చొప్పున టి బిజీ 104 విత్తనాలు పెండిమేథాలిన్‌ కలుపు ముందు పిఎస్‌బితోపాటు రైజోబియం ఇచ్చారు. మినుము పంటపై రైతులకు శిక్షణ అందించారు.శిక్షణలో డిఆర్‌సి, డిడిఎ మల్లికార్జున ఏవో శశికళ, రాస్‌ ఎస్‌ కె వి కె సైంటిస్ట్‌లు శ్రీనివాస్‌, మండల వ్యవసాయ అధికారి సుధాకర్‌ రెడ్డి, చోడవరం రైతులకులు పాల్గొన్నారు.