Jan 14,2022 22:17
  • మిర్చికి లక్ష రూపాయల పరిహారమివ్వాల్సిందే

ప్రజాశక్తి-పొదిలి (ప్రకాశం జిల్లా) : రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా, పొదిలిలోని వివేకానంద జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండేళ్లగా రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డారన్నారు. గతేడాది పంటలు దెబ్బతినగా, ఈ ఏడాది పండిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధరలేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపారు. పెట్టుబడులు సైతం తిరిగి రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో నెల రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కీలకమైన మిర్చి పంటపై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారని, పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. మిర్చి రైతులను కేంద్ర ప్రభుత్వం సంక్షోభ బోర్టు ద్వారా ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఈ సంక్షోభం నుండి బయటపడలేరని తెలిపారు. ప్రభుత్వాలు రైతు భరోసాలు ఐదారు ఇచ్చినా ప్రస్తుత సంక్షోభానిు రైతులు అధిగమించలేరన్నారు. ప్రభుత్వం ఇ-క్రాప్‌ను పక్కన పెట్టి నష్టపోయిన రైతులకు మిర్చికి రూ.లక్ష, ఇతర పంటలకు రూ.50 వేలు చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున తమ పార్టీ తరుఫున ప్రతి జిల్లాలో వైద్యులతో రోగులకు సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరి అవసరమైన చోట ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం కరోనా టెస్టులు పెంచాలని, కరోనా విస్తరించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పిఆర్‌సిలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో ఉద్యోగులకుసిపిఎం మద్దతు ఉనుట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లర్‌ చేయాలనిడిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ జాలా అంజయ్య, పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రమేష్‌ పాల్గొన్నారు.