Oct 04,2022 00:08

మృతి చెందిన నారాయణరావు

ప్రజాశక్తి-సీతమ్మధార : కైలాసపురం సమీపంలోని లక్ష్మీనారాయణ పురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే నారాయణరావు (80)పై మద్యం మత్తులో ఉన్న ఒక రౌడీ అకారణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వృద్ధుడు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిన పరిశీలించి వృద్ధుడు మతిచెందినట్లు నిర్ధారించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ ఎసిపి హర్షిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, రౌడీ పిడి గుద్దులతో నారాయణరావు కిందపడి మృతిచెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నారాయణరావు కుమారుడు సీనియర్‌ జర్నలిస్ట్‌ కెఎన్‌ఆర్‌ మాట్లాడుతూ, తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు జర్నలిస్టులు కెఎన్‌ఆర్‌ను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.